హైదరాబాద్ : జింక మాంసం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదారాబాద్లో శనివారం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి నుండి హసన్ బక్రాన్ (50) జింక మాంసం కొనుగోలు చేసి హమీద్ బిన్ హఖానీ (53), షేక్ అబ్దుల్ రెహమాన్ బహయ్యా అల్ అమూది (54) కి విక్రయించాడు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ (పశ్చిమ) బృందం శనివారం రైడ్ చేసి ఈ ముగ్గురి స్నేహితులను పట్టుకుంది. ముగ్గురి ఇళ్లపై రైడ్ చేసి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్య కోసం వారిని అటవీ శాఖకు అప్పగించినట్లు వెల్లడించారు.