Drugs | సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎస్ఆర్.నగర్‌లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఉండే ముగ్గురు డ్రగ్స్ అమ్ముతుండగా సమాచారం అందుకున్న ఆబ్కారీ అధికారులు శుక్రవారం ఎస్ఆర్ నగర్‌లోని బాయ్స్ హాస్టల్‌పై దాడులు జరిపి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12లక్షల విలువ చేసే 115 గ్రాముల ఎండీఎంఏ, 250గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే నగరంలో జరిగిన పలు రేవ్ పార్టీలకు సైతం వీరు డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ మేరకు ఆబ్కారీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఈఎస్ ప్రదీప్‌రావు పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు బి.బాలరాజ్, జయకృష్ణ, పి.అరుణ్, ఎన్.ఎల్.ఎన్. మహేశ్వర్ రావు, బి. కౌశిక్ , కె.లక్ష్మణ్ , నితిన్ చంద్రాగౌడ్, సాయికిరణ్ పాల్గొన్నారు.