సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఖాళీ స్థలాన్ని చూపుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టింది ఇక్కడే అంటున్నారేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి.. అక్షరాల రూ.23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించామని రేవంత్రెడ్డి చెప్తున్నారు. కంటోన్మెంట్ను రూ.4 వేల కోట్లతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించుకుంటున్నారు. రేవంత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలు ఆ స్థలంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ‘కనీసం శిలాఫలకం కూడా పెట్టలేదు. ఇక్కడ రూ.23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించామని ప్రచారం చేసుకోవడం తప్పు కదా సర్?’ అని ప్రశ్నించారు. హ్యాపీ బర్త్డే సీఎం అంటూ సెటైర్ వేశారు.