సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : వినాయకచవితి పర్వదినం సందర్భంగా బుధవారం గ్రేటర్‌వ్యాప్తంగా 20 బస్‌పాస్ కేంద్రాలు మాత్రమే పనిచేస్తాయని, ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు. అఫ్జల్‌గంజ్, ఆరాంఘర్, సీబీఎస్, దిల్సుఖ్నగర్, ఈసీఐఎల్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, మేడ్చల్, లోతుకుంట, మెహిదీపట్నం, మిథాని, పటాన్చెరు, రేతిఫైల్- సికింద్రాబాద్, శంషాబాద్, ఎస్ఆర్నగర్, షాపూర్‌నగర్, సుచిత్ర, ఉప్పల్ కేంద్రాలు తెరిచి ఉంటాయి. గురువారం నుంచి యధావిధిగా అన్ని బస్‌పాస్ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు.