భూమి లేకపోయినా పాస్‌బుక్
భూమి లేకపోయినా ఓ వ్యక్తికి 7 గుంటల భూమి ఉన్నట్టు పట్టాదారు పాస్‌బుక్ రావడంతో శంషాబాద్ మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని అలీకోల్తండాకు చెందిన కేతావత్ పూర్యా నాయక్‌కు సర్వే నంబర్ 192లో 1 ఎకరాల 38 గుంటల భూమి ఉండేది.
- 7 గుంటల భూమి ఉన్నట్టు ధరణిలో రికార్డు
- తప్పు ధరణిదా? ఎమ్మార్వోదా?
శంషాబాద్ రూరల్, జూలై 8 : భూమి లేకపోయినా ఓ వ్యక్తికి 7 గుంటల భూమి ఉన్నట్టు పట్టాదారు పాస్‌బుక్ రావడంతో శంషాబాద్ మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని అలీకోల్తండాకు చెందిన కేతావత్ పూర్యా నాయక్‌కు సర్వే నంబర్ 192లో 1 ఎకరాల 38 గుంటల భూమి ఉండేది. అయితే 2008లోనే అతడు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆ భూమిని మరొకరికి విక్రయించాడు. కాగా, కేతావత్ పూర్యానాయక్కు అక్కడే 7 గుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డుల్లో ఉంది. ఈ మేరకు ఎమ్మార్వో నాగమణి పూర్యా నాయక్‌కు పట్టాదారు పాస్‌బుక్కును పంపిణీ చేశారు.
భూమి లేకపోయినా పట్టాదారు పాస్‌బుక్ చేతికి అందడంతో పూర్యానాయక్ సోమవారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఇది ధరణి తప్పిదమా లేక ఎమ్మార్వో నాగమణి చేసిన తప్పిదమా తెలియక 7 గుంటల భూమి కోల్పోయిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా లేని భూమికి పట్టాదారు పాస్‌బుక్కులు ఇచ్చిన తహసీల్దార్ నాగమణిపై చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఇరువర్గాలు మధ్య జరిగిన ఘర్షణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ నాగమణి వివరణ కోసం సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

