Traffic jam | దిల్సుఖ్ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
దిల్‌సుఖ్‌నగర్‌లో(Dilsukhnagar) భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు నగరానికి తిరుగుముఖం పట్టారు.
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లో(Dilsukhnagar) భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు నగరానికి తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు నిమిజ్జనానికి దుర్గామాత విగ్రహాలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీనగర్ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు భారీగా నిలిచోయాయి. దీంతో గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ పూర్తిగా అధ్వానంగా మారింది. గతంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే సిబ్బందితో సహా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ట్రాఫిక్ సమస్య తొలగించేవారు.
కానీ ఈ మధ్యకాలంలో ప్రధాన సెంటర్లలో తప్ప అసలు సిబ్బందే ఉండకపోగా.. అధికారులు కనిపించడమే మానేశారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో తప్ప..ట్రాఫిక్ జామ్‌ల సమయంలో అధికారులే ఉండడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ సెల్ఫోన్లతో ఫొటోలు తీయడం, రోడ్డుకు పక్కకు వెళ్లి నిల్చొని ముచ్చట్లు పెట్టడం తప్ప సీరియస్‌గా డ్యూటీ చేయడం లేదు. దీంతో ఫ్రీలెఫ్ట్ ఉన్న దగ్గర, సిగ్నల్ క్రాసింగ్ నివారించలేకపోతున్నారని వాహనదారులు అంటున్నారు. కనీసం పండగల సందర్భంలోనైనా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

