మెహదీపట్నం ఫిబ్రవరి 10 : ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులు పాటించే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలింన్లను సైరన్ లను హారన్లుగా వాడుతున్న కార్లపై చర్యలు తీసుకుంటున్నారు. లంగర్ హౌస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో సోమవారం రింగ్ రోడ్ ప్రాంతంలో కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం లను తొలగించారు అదేవిధంగా హారంలను తొలగించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అంజయ్య మాట్లాడుతూ తాము స్పెషల్గాడ్రైవ్ నిర్వహించి వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నామని కేసులు నమోదు చేసి వాహనదారులను హెచ్చరిస్తున్నామని చెప్పారు .