జీడిమెట్ల, మే 30 : అర్ధరాత్రి క్యాబ్‌ను అడ్డగించి డ్రైవర్ పై దాడిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగుల(Software employees) వద్ద దోపిడికి పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారు జామున 2:30 గంటలకు అనిల్ (24) తన క్యాబ్‌లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి షాపూర్‌నగర్ నెహ్రునగర్‌కు తీసుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో గాజుల రామారంలోని నెహ్రూనగర్ ప్రధాన రహదారికి చేరుకోగానే మున్నా, రాజాసింగ్, అఖిల్‌తో పాటు మరో ముగ్గురు దుండగులు మద్యం మత్తులో క్యాబ్‌ను అడ్డగించి ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, కొంత నగదును లాక్కున్నారు. అంతేకాకుండా డ్రైవర్ అనిల్ మెడపై బ్లెడుతో దాడి చేసి(Thugs attacked) గాయపరిచారు. గాయపడిన అనిల్ ను స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురు దుండగుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల సీఐ విజయ్ తెలిపారు.