కవాడిగూడ, జూన్ 7: దోమలగూడలోని లిబర్టీ వద్దనున్న సిగ్నల్ పోల్ కేబుల్‌పై పాము ప్రత్యక్షం కావడంతో ప్రజలు బెంబేలెత్తారు. వివరాలిలా ఉన్నాయి.. లిబర్టీ చౌరస్తాలో ఉన్న సిగ్నల్ పోల్ కేబుల్ పైనుంచి శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో పాము వెళ్తూ బాటసారుల కంట పడింది. పామును చూసిన బాటసారులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దూరంగా ఆగిపోయిన బాటసారులు.. తమ సెల్ఫోన్లతో పాము వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపరి పీల్చుకున్నారు.