వెంగళరావునగర్ సెప్టంబర్ 23: బ్లీచింగ్ పౌడర్ ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొంది. ఎస్ఆర్నగర్ పోలీసుల కథ నం ప్రకారం.. ఎర్రగడ్డ హైమావతినగర్లో రమేశ్,లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. బల్కంపేట్ లింగయ్యనగర్ లో స్పర్స్ పర్సనలైజ్డ్ గిఫ్టింగ్‌లో 8 సంవత్సరాలుగా లక్ష్మి (43)పనిచేస్తుంది.
గిఫ్ట్ ప్యాకింగ్‌తో పాటు..బాత్రూంలను లక్ష్మి శుభ్రం చేసేది. సోమవారం సాయంత్రం లక్ష్మి బ్లీచింగ్ పౌడర్‌తో బాత్రూంను క్లీనింగ్ చేస్తుండగా వాసనకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులకు గురై స్పృహ కోల్పోయింది. ఆమెను వెంటనే అమీర్‌పేట్ లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.