పోచారం,ఏప్రిల్ 17: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్‌ను తొలగించి పాత పద్ధతి ద్వారనే రిజిస్టేషన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో పనిచేసే డాక్యూమెంట్ రైటర్లు గురువారం మూడోరోజు ఆందోళన కొనసాగించారు. తక్షణమే స్లాట్ పద్దతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో..
మేడ్చల్: స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు చేపట్టిన ఆందోళన కొనసాగింది. గురువారం మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు.
రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట..
బండ్లగూడ: ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట గురువారం డాక్యుమెంట్ రైటర్లు ధర్నా నిర్వహించారు.