– గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
చాదర్‌ఘాట్, మే 5 : కరోనా పాండమిక్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేసిన సేవలు ఎనలేనివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పాండమిక్ తర్వాత ఆరోగ్య పరిరక్షణ గురించి శ్రద్ధ చూపుతున్నారన్నారు. శనివారం రాత్రి చాదర్గాట్లోని మలక్‌పేట కేర్ దవాఖాన ప్రారంభోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేర్ దవాఖాన హెల్త్సెక్టార్లో రాణిస్తుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉత్తమ వైద్య సేవలను అందించాలన్నారు. అత్యధిక జనాభా, ఆర్థిక నేపథ్యం వంటి అవాంతరాలను ఎదుర్కుని పాండమిక్ స్టేజ్‌లో కరోనాను దేశంలో అదుపులోకి తీసుకొచ్చారన్నారు. ఇందులో హెల్త్ విభాగం కీలకంగా వ్యవహరించారన్నారు. కేర్ హాస్పటల్స్ సీఈఓ జస్దీప్సింగ్ మాట్లాడుతూ.. రోగుల సంరక్షణ కు ప్రమాణాలను మెరుగుపరిచామన్నారు. 200 బెడెడ్ సౌకర్యంతో అనేక సూపర్ స్పెషాలిటీ కేర్ ను మలక్‌పేట కేర్‌లో ప్రవేశపెట్టామన్నారు. దేశంలోని 5 రాష్ర్టాలలో 14 హెల్త్‌కేర్ సౌకర్యాలని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల విచ్చేసి దవాఖాన ప్రాంగణంలో మొక్కను నాటారు.