Srinivas Goud | తెలుగు యూనివర్సిటీ, మే 27: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చారిత్రాత్మకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 31న జలవిహార్లో నిర్వహించనున్న టీజేఎఫ్ రజతోత్సవాల వాల్ పోస్టర్ను మంగళవారం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, టీయూడబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా సమైక్యాంధ్రలో తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమించారని పేర్కొన్నారు. 31న జలవిహార్లో నిర్వహిస్తున్న టీజేఎఫ్ రజతోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.