Crime News | వృద్ధురాలిని కట్టేసి కొట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.
- వృద్ధురాలి దారుణ హత్య
Crime News | కవాడిగూడ, జనవరి 31: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. దోమలగూడ గగన్‌మహల్‌లోని రాధామాదవ్ నివాస్ మొదటి అంతస్తులో మహేశ్ తన భార్య స్నేహలత, కుమారుడు పవన్‌తో కలిసి ఉంటున్నాడు. స్నేహలత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా బిహార్‌కు చెందిన మహేశ్‌ను పనిమనిషిగా పెట్టుకున్నారు.
బుధవారం స్నేహలత కుటుంబ సభ్యులు మార్కెట్‌కు వెళ్లగా.. ఒంటిరిగా ఉన్న స్నేహలతను మహేశ్ మరో వ్యక్తితో కలిసి కుర్చీలో బంధించాడు. కొట్టి, అరుపులు బయటకు వినిపించకుండా నోటిలో గుడ్డలుకుక్కారు. అనంతరం బీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని తీసుకొని పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. స్నేహలత కుర్చీలో బంధించి, అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను వెంటనే హైదర్‌గూడలోని అపోలో దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మహేశ్ కనిపించకపోవడంతో అతడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని గాంధీనగర్ ఏసీపీ రవికుమార్, దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితోపాటు క్లూస్‌టీం సందర్శించాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

