సిటీబ్యూరో, మే22,(నమస్తే తెలంగాణ): ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతిని గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎండీ అశోక్ రెడ్డి హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్లు సుదర్శన్, శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్-1 అమరేందర్ రెడ్డి, పర్సనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్, సీజీఎం, జీఎంలు,అధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో..
అణగారిన వర్గాల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషి ఎనలేనిదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య అకాడమీ కార్యాలయంలో..
రవీంద్ర భారతి, మే 22: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అకాడమీ సిబ్బందితోపాటు సాహితీవేత్తలు పాల్గొని నివాళులర్పించారు.