సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు నడిచే పుష్పక్ బస్సుల్లో నెలవారీ బస్‌పాస్ చార్జీలు రూ.1,000 తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. అంటే ప్రస్తుతం రూ.5,000 ఉన్న బస్‌పాస్ చార్జీ రూ.4,000 తగ్గించారు. అయితే బస్ చార్జీలపై రూ.5 శాతం జీఎస్టీ యధావిధిగా కొనసాగుతుంది.
పుష్పక్‌లో తగ్గించిన నెలవారీ బస్‌పాస్ చార్జీలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి, సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి సీహెచ్. వెంకన్న తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు మియాపూర్ మెట్రో స్టేషన్లో పుష్పక్ కేంద్రాన్ని గ్రేటర్ జోన్ ఈడీ ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వివిధ ప్రాంతాల నుంచి 24/7 సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.