సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మెట్రో ప్రయాణికులకు సూపర్ సేవర్ -59 ఆఫర్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న ఈ ఆఫర్ మార్చి 31,2023తో ముగిసిందని, తిరిగి ఈ ఆఫర్ 23 సెప్టెంబర్ 2023 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని తెలిపారు.
ఈ అద్బుతమైన ఆఫర్‌ను పొందేందుకు ప్రయాణికులు తాము గతంలో కొనుగోలు చేసిన మెట్రో హాలిడే కార్డ్‌ను ఉపయోగించవచ్చు. లేదా కొత్తగా మెట్రో హాలిడే కార్డ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు మెట్రో స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ నుంచి సెలవు జాబితాను అనుసరించి సూపర్ సేవర్ హాలిడేస్‌లో కేవలం రూ.59లకే రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎల్టీ మెట్రో డాట్ కామ్ వెబ్‌సైట్‌ను, ఏదైనా మెట్రో స్టేషన్లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.