Fever survey | మరో రెండు రోజుల్లో ఇంటింటి జ్వర సర్వే పూర్తి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

గోల్నాక : కరోనా థర్డ్ వేవ్‌లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి జ్వరం సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వారం రోజుల పాటు చేపట్టిన ఇంటింటి సర్వే మరో రెండు రోజుల్లో ముగియనుందని తెలిపారు. ఈ సర్వే పూర్తితో కరోనా కట్టడికి కళ్లెం పడుతోందని ఆయన అన్నారు.
మంగళవారం గోల్నాక డివిజన్ కమలానగర్లో స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస గౌడ్‌తో కలసి ఇంటింటి జ్వరం సర్వేను ఆయన పరిశీలించారు. వైద్య అరోగ్య సిబ్బందిని అడిగి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
కరోనా కట్టడికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్యయం చేసుకొని ఇంటింటి సర్వేలో భాగంగా జలుబు, దగ్గు, గొంతుప్పి తదితర లక్షణాలు ఉంటే వెంటనే వారికి పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్ అందజేస్తున్నారని ఆయన తెలిపారు.
సర్వే కోసం ఇంటికి వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. తగిని జాగ్రత్తలు పాటిస్తూ కరోనా భారిన పడుకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలోడాక్టర్ మమతతో పాటు వైద్య అరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

