సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 29: అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి అందె రాంబాబు, కొల్లి నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సోమవారం ఎమ్మార్పీఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో విజయనగర్‌కాలనీలోని డెక్కన్ ప్లాజాలో వీహెచ్పీఎస్, చేయూత పెన్షన్ దారుల, ఎమ్మార్పీఎస్ సంయుక్తాధ్వర్యంలో సన్నాహక నిర్వహించిన సదస్సుకు హాజరైన వారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.6వేలు, ఇతర అన్ని పెన్షన్ దారులకు రూ.4 వేలు పెంచి ఇవ్వాలని అన్నారు. అలాగే నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ హైదరాబాద్ ఇన్చార్జి ఇంజన్ వెంకటస్వామి మాదిగ, వీహెచ్పీఎస్, కళామండలి సీనియర్ నాయకులు సునీల్ బాబు, ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నర్సింహ మాదిగ, వీహెచ్పీఎస్ నాంపల్లి ఇన్చార్జి పీ సత్యనారాయణ, ఎంఎంఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు సురవరం సుజాత మాదిగ, ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ నాంపల్లి కో ఇన్చార్జి చోట రమేష్ మాదిగ, సీపీహెచ్పీఎస్ నాంపల్లి కన్వీనర్ దాసరి సుధాకర్, వీహెచ్పీఎస్ నాంపల్లి ఇన్చార్జి చేవెళ్ల కుమార్, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.