మాదాపూర్, సెప్టెంబర్ 4: ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు శారీరక వ్యాయమాలు చేసే విధంగా వసతులను కల్పించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో కూకట్పల్లి, హైటెక్ సిటీ వద్ద ఏర్పాటు చేయనున్న వాసవీ సరోవర్ ప్రారంభోత్సవంలో భాగంగా వాసవీ సరోవర్ బ్రోచర్‌ను వాసవీ గ్రూప్ సీఎండీ యర్రం విజయ్‌కుమార్, డైరెక్టర్లతో కలిసి సోమవారం ఆమె ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని, వాసవీ గ్రూప్ అధికంగా ఖాళీ స్థలాలను వదిలి నిర్మాణాలు చేపట్టి, ఆట స్థలాలను, వ్యాయామ శాల, బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసినందుకు ఆమె అభినందించారు. ఇతర రెసిడెన్షియల్ కంటే వాసవీ సరోవర్ 72శాతం ఓపెన్ స్థలాలను కలిగి ఉన్నదని సీఎండీ యర్రం విజయ్‌కుమార్ తెలిపారు. కూకట్పల్లి, హైటెక్ సిటీ వద్ద 21.48 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 72 శాతం ఖాళీ ప్రదేశాల్లో దాదాపు 100 సౌకర్యాలను కలిగి ఉన్నదని చెప్పారు.
దేశంలో మొదటి సారిగా నగరంలో మూడు సరస్సులను సీఎస్ఆర్ ఇనిషియేటెడ్ కింద దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. వాసవీ గ్రూప్ నివాసితులకు మెరుగైన వసతులను కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పెట్ పార్క్ సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, వ్యాయామశాలలు, క్లబ్ హౌజ్‌లు, చుట్టూ పచ్చిక బయళ్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 10 మిలియన్ల ఎస్ఎఫ్టీతో 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, 17 కమర్షియల్ ప్రాజెక్టులను అందించనున్నారు. ప్రారంభ ఆఫర్లో రూ. 6999కి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి నిర్మాణాలను పూర్తి చేసి అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ గ్రూప్ అభిషేక్ చందా, సౌమ్యతో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు.