గౌతంనగర్, మార్చి 8 : మౌలాలి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, తదితర పనులను దశలవారీగా చేపడుతున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి.. మూడునెలల్లో రూ.18కోట్ల నిధులను మంజూరు చేయించారు. మారుతీనగర్, మొగల్కాలనీ, సాయినాథపురం, లక్ష్మీనగర్, గణేశ్‌నగర్, నెహ్రూనగర్, ప్రగతినగర్, క్రియేటీవ్నగర్, షఫీనగర్, మౌలాలి, సాదుల్లానగర్, మౌలాలి చిల్లా, ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్, హనుమాన్‌నగర్, సుధానగర్, సంతోషిమానగర్, సీపీఎం బస్తీ ,తదితర ప్రాంతాల్లో రూ.18కోట్లతో సీసీ రోడ్లు, వా టర్ పైపులైన్ల పనులు, డ్రైనేజీ, బాక్స్డ్రైనేజీ నిర్మాణ పను లు చేపట్టారు. అందులో భాగంగానే డాక్టర్ కృష్ణానగర్‌లో రూ.32లక్షలతో సీసీ రోడ్డు పనులు నడుస్తున్నాయి.
రూ.18 కోట్లతో అభివృద్ధి పనులు..
మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పనులేకాకుండా, డివిజన్లో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సరఫరా పైపులైన్ల పనుల కోసం మూడు నెలల్లో దాదాపుగా రూ.18 కోట్ల నిధులు మంజూరు చేయించి.. పనులు చేపట్టాం. దాదాపుగా 90శాతం పనులు పూర్తి కాగా.. మిగతా 10శాతం పనులు నడుస్తున్నాయి. నా దృష్టికి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కారిస్తున్నాం. గతంలో చాలా మంది మౌలాలి డివిజన్ నుంచి రోడ్లులేవు, డ్రైనేజీ లేదని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు చేశారు. వెంటనే అధికారులతో అక్కడికి వెళ్లి.. పరిశీలించి.. నిధులను మంజూరు చేయించి.. పనులు చేట్టాం.