గౌతంనగర్, జనవరి 2 : మౌలాలి డివిజన్ పరిధి, భరత్‌నగర్ బస్తీ అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోనే సాధ్యమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాగ్యానందరావు, భరత్‌నగర్ బస్తీ అసోసియేషన్ అధ్యక్షులు మంద భాస్కర్, చందు పేర్కొన్నారు. కొన్నేండ్ల నుంచి భరత్‌నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రజా దర్భార్‌లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మె ల్యే.. భరత్‌నగర్ అభివృద్ధి కోసం దాదాపుగా 1.8కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఇందులో భాగంగా సోమవారం భరత్‌నగర్ ప్రధాన మార్గంలో భూగర్భడ్రైనేజీ ఏర్పాటు కోసం ఆర్సీసీ పైపులైన్ పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా భరత్‌నగర్ బస్తీ వాసులు, అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మైనంపల్లికి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యేండ్ల నుంచి భరత్‌నగర్ అభివృద్ధికి నోచుకోలేదని ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిధులను మంజూరు చేయించి పనులు చేపట్టారని తెలిపారు. భరత్‌నగర్ బస్తీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీఇచ్చిన ప్రకారమే అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని బస్తీవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుండిగళ్ల చంద్రకాంత్, రాందాస్, రాజు, నాగరాజు, జానీ సాగర్, కృష్ణ, జాన్‌బీ, రాణి, గోపి, ప్రభాకర్‌యాదవ్, లక్ష్మణ్‌స్వామి, పద్మ, భారతమ్మ, స్వప్న పాల్గొన్నారు.