చెత్త నిర్వహణ.. డిజిటల్ ట్రాకింగ్
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా చెత్త నిర్వహణను డిజిటల్ ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దాని ద్వారా ప్రజలు చెత్త నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నారా? ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారా? తడి, పొడి, బయో వ్యర్థాలను వేరు చేస్తున్నారా? లేదా?
సిటీబ్యూరో: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా చెత్త నిర్వహణను డిజిటల్ ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దాని ద్వారా ప్రజలు చెత్త నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నారా? ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారా? తడి, పొడి, బయో వ్యర్థాలను వేరు చేస్తున్నారా? లేదా? వంటి వివరాలను డిజిటల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తారు. అలాగే చెత్త ఉత్పత్తి నుంచి నిర్వహణ దాకా అన్ని దశలను పర్యవేక్షిస్తారు.
అలాగే నూతన మార్గదర్శకాల ప్రకారం తడి, పొడి, పారిశుధ్య, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వ్యర్థాల పేరిట నాలుగు రకాలుగా విభజించారు. తడి చెత్త కింద వంటగది, సేంద్రియ వ్యర్థాలు వీటిని డంపింగ్ యార్డులకు తరలించాలి. పొడి వ్యర్థాల కింద ప్లాస్టిక్, కాగితం, లోహం, గాజు పదార్థాలు ఉంటాయి. వీటిని రీసైక్లింగ్ కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్‌కు పంపాలి. పారిశుధ్య వ్యర్థాల కింద వాడిన డైపర్లు, శానిటరీ ఉత్పత్తులు ఉంటాయి. వీటిని భద్రంగా చుట్టి నిల్వచేయాలి. ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వ్యర్థాలైన బల్బులు, పెయింట్ డబ్బాలు, బ్యాటరీలు, గడువు ముగిసిన మందులను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించాల్సి ఉంటుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

