హైదరాబాద్ : పాత బస్తీ ఛత్రినాకలో(Chatrinaka) దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మరో ఉన్మాది చెలరేగిపోయాడు. ప్రేమించడం లేదని ప్రియురాలపై(Girlfriend) ప్రేమోన్మాది కత్తితో (Knife) దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా(Attack) గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించి ప్రేమోన్మాదికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ప్రియురాలిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.