సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. అవినీతి అక్రమాలపై ఆరోపణలు రావడంతో కుల్సుంపురా ఏసీపీని కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కుల్సుంపురా ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయగా తాజాగా ఏసీపీపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
‘బెదిరింపులు-సెటిల్మెంట్ల’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు ఆరా తీయడంతో ఏసీపీపై అవినీతి ఆరోపణలు, సెటిల్మెంట్లు, కేసుల తారుమారుకు సంబంధించిన విషయాలు బయటపడినట్లు సమాచారం.ఇదే ఆరోపణలపై మూడు రోజుల క్రితం కుల్సుంపురా ఇన్స్పెక్టర్ సునీల్‌కుమార్‌ను సీపీ సజ్జనార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అవినీతి, అక్రమాల్లో సీఐ, ఏసీపీలకు సంబంధాలుండడంతో సీపీ వరుసగా అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.