జవహర్‌నగర్, జనవరి 13: యువతులకు మాయమాటలతో వల వేస్తాడు.. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని పెండ్లి చేసుకుంటాడు.. కొన్ని రోజుల తర్వాత దూరంగా ఉంటాడు. ఇలా మూడు పెండ్లిళ్లు చేసుకుని తప్పించుకుతిరుగుతున్న నిత్య పెండ్లి కొడుకును జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం… జవహర్‌నగర్ కార్పొరేష న్, అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్పేట్లో లక్ష్మణరావు(34) ఉంటూ.. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మా యి అనూషనులో వివాహం చేసుకున్నాడు. ఆమెతో మనస్పర్థల కారణంగా దూ రంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి(25)ని ప్రేమిస్తున్నానని చెప్పి మెదక్ చర్చిలో 2021లో వివాహం చేసుకున్నాడు. లీలావతికి 2022లో గాంధీ దవాఖానలో బాబు పుట్టాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల లక్ష్మణరావు మల్కాజిగిరిలో ఉంటున్నాడని లీలావతి కుటుంబ సభ్యులు తెలుసుకుని నిలదీయగా… మరో మహిళ శబరిని వివాహం చేసుకున్నానని చెప్పాడు. దీంతో కంగుతిన్న లీలావతి..ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ ముగ్గురిని వివాహం చేసుకున్న లక్ష్మణరావుపై పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు లక్ష్మణరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.