వీడిన దొంగతనం కేసు మిస్టరీ
ముల్తానిపురా దొంగతనం మిస్టరీని గోషామహల్ పోలీసులు చేధించి ఒకరిని అరె స్ట్ చేసి యాభై లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ కేసు వివరాలను వెల్లడించారు. ముల్తానిపురాలోని మూడవ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి రోజు ఇంటికి తాళం వేసి పెండ్లి పనులకు వెళ్లి వస్తున్నాడు.
- దొంగిలించిన 50 లక్షల సొత్తు స్వాధీనం
అబిడ్స్, మే 12ః ముల్తానిపురా దొంగతనం మిస్టరీని గోషామహల్ పోలీసులు చేధించి ఒకరిని అరె స్ట్ చేసి యాభై లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ కేసు వివరాలను వెల్లడించారు. ముల్తానిపురాలోని మూడవ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి రోజు ఇంటికి తాళం వేసి పెండ్లి పనులకు వెళ్లి వస్తున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన అతని బంధువు దొంతుల రాజేష్ గమనించాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లతో నష్టాలకు గురైన ఆయన మహే ష్ నివాసంలో దొంగతనం చేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఆదివారం రాత్రి మహేష్ ఇంట్లోకి చొరవడి అల్మారాలోని 30 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నరకు పైగా వెండి సామాగ్రి, ఐదు లక్షల నగదు ఇతర సామాగ్రిని దొంగిలించి పరారయ్యాడు. దొంగిలించిన సామాగ్రిని ఒక సంచిలో పెట్టి లోపలి గదిలో దాచి పెట్టాడు. యధావిధిగా ఎవరికీ అనుమానం రాకుండా ఆటో నడపడానికి వెళ్లాడు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్‌కు తెలిసిన తెలిసిన వారు దొంగతనం చేసి ఉంటారని సమీపంలోని రాజేష్ ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చిన రాజేష్‌ను ప్రశ్నించగా తడబడుతూ సమాధానం ఇవ్వడంతో పోలీసులు అతన్ని గట్టిగా నిలదీశారు. రాజేష్ దొంగిలించిన విషయాన్ని అంగీకరించాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దొంగిలించిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీని చేధించిన ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్‌కు డీసీపీ రివార్డ్స్ ఇచ్చి ప్రశంసించారు. గోషామహల్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యం లో ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్, ఎస్ఐ అజిత్‌లు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

