సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నచ్చిన ఫ్యాన్సీ నెంబర్‌ను లక్షలు వెచ్చించి వాహనదారులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఫ్యాన్సీ బిడ్డింగ్‌లో 64 లక్షల ఆదాయం ఆర్టీఏ ఖజానాలో జమ అయింది. టీజీ09జీ 9999 నెంబర్‌ను రూ.25.50లక్షలతో హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది.
అదే కోడ్‌తో 0009ను రూ.6.50లక్షలకు ఏఆర్ఎల్ టైర్స్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. 0001ను రూ.6.25లక్షలకు డాక్టర్ రాజేశ్వరీ హెయిర్ కేర్ లిమిటెడ్ దక్కించుకుంది. 0006 నెంబర్‌ను రూ.5.11లక్షలకు ఏఎంఆర్ ఇండియా కైవసం చేసుకుంది. 0005ని 1.51లక్షలకు పోచ విజయ దక్కించుకుంది.