Firecrackers | హైదరాబాద్ : దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బాణసంచా విక్రయించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ప్రతి దుకాణదారుడు పేలుడు పదార్థాల చట్టం 1884, పేలుడు నియమాలు 1983(2008లో సవరించబడింది) కింద లైసెన్స్ తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు.
బాణసంచా దుకాణాలను లైసెన్స్‌లను పోలీసు శాఖకు చెందిన జోనల్ డిప్యూటీ కమిషనర్లు లైసెన్స్‌ను జారీ చేస్తారని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీలోగా దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుల కోసం cybpms.telangana.gov.in లేదా cyberabadpolice.gov.in అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.