హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెలబ్రిటీ క్రికెట్ లీగ్(2023) మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్ గెలుపు జోరు కొనసాగుతున్నది. ఆదివారం కేరళ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత వారియర్స్ మొదటి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లకు 148 పరుగులు చేసింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని(85)టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కేరళ 10 ఓవర్లలో 98/5 పరిమితమైంది. ప్రిన్స్(4/18) రాణించాడు. 50 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన వారియర్స్ 10 ఓవర్లలో 119/4 స్కోరు చేసింది. అఖిల్(19 బంతుల్లో 65) అదరగొట్టాడు. 170 పరుగుల లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కేరళ 105/6 స్కోరుకు పరిమితమైంది. తమన్ (3/12) ఆకట్టుకున్నాడు. అఖిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.