తెలుగు యూనివర్సిటీ, జూన్ 21 : తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హిల్స్‌లో గల ఫ్యాప్సీ భవన్లో జీఎస్టీ , ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ హరిత, జాయింట్ కమిషనర్ అరవింద రెడ్డి పాల్గొని రాష్ట్ర పన్నుల ఆదాయంఎలా పెంచాలో అసోసియేషన్ సభ్యులకు సూచనల ద్వారా వివరించారు.
పలు అంశాలలో సమగ్ర విశ్లేషణ, సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తిపై అవగాహన కల్పించారు. ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ మెంబర్స్ డైరెక్టరీని వారు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కే. నర్సింగ రావు మాట్లాడుతూ.. సభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన పెంచడంతో పాటు సందేహాలను పరిష్కరించుకునేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. ఈ సెమినార్లో అసోసియేషన్ ఛీఫ్ అడ్వైజర్ పీవీ సుబ్బారావు, వక్తలు చార్టర్డ్ అకౌంట్స్ ఆశిష్, గణేష్, శీరీష్, ఉపాధ్యక్షులు కేవి రమణ మూర్తి, బీ. దుర్గాప్రసాద్, కార్యదర్శి పీ. గోపాల్, కోశాధికారి హుస్సేన్ వలిలతో పాటు జిసి మెంబర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.