కొండాపూర్/మేడ్చల్: శక్తి సీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట బుధవారం సుమారు 200 మంది విద్యార్థులు నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ)లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేండ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే శక్తి స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్‌లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.