న్యూఢిల్లీ, అక్టోబర్ 2: తన వయోజన కుమారుడి ప్రవర్తనను అదుపుచేయడంలో విఫలమైనంత మాత్రాన గృహహింస చట్టం కింద మామగారిని బాధ్యుడిని చేయలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తనపై గృహహింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో తన మామగారిపై చర్యలు తీసుకోరాదని దిగువ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ మధు జైన్ ఈ ఉత్తర్వు జారీ చేశారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న కుమారుడిపై చర్య తీసుకోవడంలో మామగారు విఫలమయ్యారని పిటిషనర్ ఆరోపించారు.కక్షిదారుల మధ్య గృహ సంబంధం ఉండటం మాత్రమే గృహ హింస చట్టం వర్తింపచేయడానికి సరిపోదని కోర్టు అభిప్రాయపడింది.