పీర్జాదిగూడ, జూన్ 12 : గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అద్వితీయమైన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏవీ ఇన్ఫోప్రైడ్ గ్రౌండ్ నుంచి డెకత్లాన్ వరకు నిర్వహించిన 2కే రన్‌ను మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్‌తో ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని తెలిపారు. అంతకుముందు ఏవీ ఇన్ఫోగ్రౌండ్లో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ హఠార్మణంపై రెండు నిమిషాలు మౌనం పాటించి 2రన్‌ను కుసుమ జగదీశ్‌కు అంకితం ఇస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేసి ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అగస్త్యా, డీసీపీ జానరీ, ఏసీపీ నరేశ్ రెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు, విద్యార్థులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Hyd13