జయేశ్ రంజన్‌కు నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ ఉన్న త న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026 రూపకల్పనలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
- నూతన ప్రకటనల పాలసీ రూపకల్పనలో కోర్టు ఆదేశాల ధిక్కరణపై ఆగ్రహం
సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ ఉన్న త న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026 రూపకల్పనలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలను తుంగలో తొకుతూ, ఎటువంటి విచారణ చేపట్టకుండానే గత నెల మార్చి 4న ప్రభుత్వం అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026ను విడుదల చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) ప్రతినిధులు గత నెల మార్చి 26న కోర్టు ధికరణ పిటిషన్ (సీసీ నంబరు. 1190/2026) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆదేశాల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని జయేశ్‌రంజన్‌కు నోటీసులు పంపింది. పాలసీ రూపకల్పన సమయంలో వాటాదారులైన (షేక్హోల్డర్లు), హోర్డింగ్ యాజమానుల వినతులను పరిశీలించాలని, ప్రైవేట్ భవనాలపై హోర్డింగ్‌ల ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ ధర్మాసనం నూతన పాలసీ రూపకల్పనకు ముందే ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఐతే ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు వివరణ ఇవ్వాలని జయేశ్ రంజన్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం నూతన ప్రకటన పాలసీ విషయంలో మొదట్నుంచి ఏకపక్ష ధోరణిని ప్రదర్శించింది. ఒకరిద్దరి బడా ఏజెన్సీల కోసమే ప్రకటలన్నీ దారాదత్తం చేసేలా పాలసీని తీసుకురావడం, హైకోర్టు సైతం నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐతే ఆగమేఘాల మీద పాలసీని తీసుకువచ్చిన అధికారులు ఈ నెల 15వ తేదీలోపే టెండర్‌ను పిలిచి ప్రభుత్వ ప్రాపర్టీలన్నీ బడా ఏజెన్సీలకే అప్పగించేలా కార్యాచరణకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు తీర్పు అధికారులకు అడుగులు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి
కొత్త పాలసీతో అడ్వరె్టైజింగ్ రంగంపై ఆధారపడిన లక్ష కుటుంబాల ఉపాధి ప్రశ్నార్థకమైందని టోమో జనరల్ సెక్రటరీ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మొండిగా వ్యవహరిస్తూ కోర్టు ఆదేశాలను ధికరించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి, కొత్త అడ్వరె్టైజింగ్ పాలసీని రద్దు చేయాలి. ఇప్పటికే బల్దియా కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టాం. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తాం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

