Dhoolpet | ధూల్‌పేట్‌పై ప్రత్యేక నిఘాతో నిరంతర దాడులు.. పోలీసులు, ఎక్సైజ్ కలిసి దాడులకు ప్రణాళికలు
Dhoolpet | గంజాయి అమ్మకాలకు కార్ఖానాగా మారిన ధూల్‌పేట్‌లో ఆగస్టు 31 నాటికి గంజాయి అమ్మకాలు, వినియోగం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. ఈ కట్టడి చేయాలంటే ఎక్సైజ్ శాఖకు పోలీసులు అన్ని విధాలా సహకరించాలన్నారు.
Dhoolpet | హైదరాబాద్ : గంజాయి అమ్మకాలకు కార్ఖానాగా మారిన ధూల్‌పేట్‌లో ఆగస్టు 31 నాటికి గంజాయి అమ్మకాలు, వినియోగం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. ఈ కట్టడి చేయాలంటే ఎక్సైజ్ శాఖకు పోలీసులు అన్ని విధాలా సహకరించాలన్నారు.
సోమవారం అబ్కారీ భవన్‌లోని సమావేశ మందిరంలో ఎక్సైజ్, పోలీసులతో కో అర్డినేషన్ సమావేశం జరిగింది. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు చేపట్టి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఎక్సైజ్ శాఖ, పోలీసులు కలిసి ధూల్‌పేట్‌లో తనిఖీలు ముమ్మరం చేయాలని కోరారు. ప్రధానంగా ధూల్‌పేటకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది..? ఎలా వస్తుంది..? తీసుకొస్తున్న వారేవరు..? కొనుగోలుదారులెవ్వరు..? ఎక్కడి నుంచి రవాణా అవుతుంది..? ఎక్కడి నుంచి ధూల్‌పేట్‌కు రవాణాగా వస్తుందనే విషయాలపై నిఘా పెట్టి గంజాయిని నియంత్రణలోకి తీసుకురావాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశించారు.
ధూల్‌పేట్‌తోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా గంజాయి, డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్సైజ్ పోలీసులకు పోలీసుల సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించాలని కోరారు. హైదరాబాద్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేకంగా ధూల్‌పేట్‌పై నిఘా పెంచాలన్నారు. ఆగస్టు 31 నాటికి ధూల్‌పేట్‌ను గంజాయి ఫ్రీ ప్రాంతంగా మార్చాలన్నారు.
ఈ సమావేశంలో సౌత్‌జోన్ డీసీపీ చందమ్రోహన్, అడిషనల్ డీసీపీ ముస్తాక్, ఏసీపీ భాస్కర్, ఏసీపీ మునావర్, ఎక్సైజ్ అండ్ ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రీ, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, డీఎస్పీలు శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, ఈఎస్‌లు సిహెచ్ విజయ్, అంజి రెడ్డి, ప్రదీప్‌రావు, మంగళ్‌హట్ సీఐ మహేష్, ధూల్‌పేట్ సీఐ మధుబాబు ఇతరలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

