Employees JAC | సుల్తాన్ బజార్, సెప్టెంబర్ 1: సీపీఎస్, యూపీఎస్‌లు బేషరతుగా మా కొద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాక్ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. ఈ మేరకు ఆదివారం పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని గన్ పార్కులో నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, ఉపాధ్యాయ, పెన్షనర్లతో కలిసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెన్షన్ ఉద్యోగుల హక్కు అని అన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని మాట్లాడుతూ సీపీఎస్, యూపీఎస్ ఒద్దురా.. ఓపీఎస్ ముద్దురా… అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాక్ పిలుపు మేరకు ఉద్యోగులు పాల్గొని పెద్ద పెట్టున నినాదాలు ఇవ్వగా, గన్ పార్క్ ప్రాంగణం మార్మోగింది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీపాల్ రెడ్డి, స్థిత ప్రజ్ఞ, ఏనుగుల సత్యనారాయణ, ఎంబీ క్రిష్ణ యాదవ్, గండూరి వెంకట్, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉమాదేవి, శైలజ, బి.శంకర్, తెలంగాణ నాల్గవ తరగతి అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, ఖాదర్ బిన్ హసన్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్.విక్రమ్ కుమార్, సభ్యులు కేఆర్ రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, కురాడి శ్రీనివాస్, ఖాలేద్ అహ్మద్, ముఖీం ఖురేషి, శ్రీధర్, రాజు, క్రిష్ణతో పాటు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్: పెన్షన్ లేకుండా చేస్తున్న సీపీఎస్ అనే మహమ్మారి అంతం ఎంతో దూరంలో లేదని, కొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూపీఎస్‌ను కూడా అంగీకరించేది లేదని పీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామేశ్వర్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పీఆర్టీయూ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి నల్లటి దుస్తులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, కీసర మండల అధ్యక్షులు చీర యాదగిరి, నాయకులు సుభాష్, మహేశ్, గోపాల్, నర్సింహులు, విఠల్, రవీందర్, శ్రీనివాస్, సుధాకర్, రాఘవ, రామచంద్రయ్య, బిక్షపతి, గోపాల్ కల్పన, జ్యోతి పాల్గొన్నారు.