కాప్రా, ఆగస్టు 31: ఇటీవల దివంగతులైన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతి పై తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఆదివారం సంతాపం ప్రకటించింది. శాసన సభ స్పీకర్ గడ్డ ం ప్రసాద్‌కుమార్ ఈ మేరకు శాసన సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
బండారి రాజిరెడ్డి 2009 నుంచి 2014వరకు ఉప్పల్ శాసనసభ్యులుగా ఉన్నారని, ఆయనతో పాటు తాను ఆ సభలో సభ్యుడినని, స్పీకర్ గుర్తు చేసుకున్నారు. కాప్రా మున్సిపాలిటీ చైర్మన్‌గా, తిరుమల తిరుపతి పాలకమండలి సభ్యులుగా, ఉప్పల్ ఎమ్మెల్యేగా రాజిరెడ్డి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. దివంగత రాజిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరేందుకు శాసన సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించాలని స్పీకర్ కోరగా, శాసనసభ్యులు మౌనం పాటించారు.