సిటీబ్యూరో, జూన్ 6 ( నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో స్టూడెంట్ బస్సు పాస్‌లు శుక్రవారం నుంచి దరఖాస్తుకు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఈ బస్సు పాస్‌ల దరఖాస్తులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అప్లోడింగ్, పేమెంట్ ప్రక్రియ కావడం లేదని చెబుతున్నారు. విద్యా సంస్థకు కొత్త బస్సు పాస్ కోడ్ కేటాయించిన అనంతరం ఆర్టీసీ యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అందిస్తుంది.
వీటి ఆధారంగా ఆన్లైన్లో లాగిన్ అయి పాస్‌లకు దరఖాస్తులు చేసుకోవాలి. అయితే బస్సు పాస్ కోడ్లు జారీ అయ్యే ప్రక్రియ కూడా ఆలస్యంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 8, 9న జరిగే చేప ప్రసాద పంపిణీ దృష్ట్యా ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బస్సుల సమాచారం కోసం 9959226160 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.