Credit cards | సిబిల్ స్కోర్ పూర్తిగా దెబ్బతిన్నా క్రెడిట్ కార్డు పొందవచ్చు.. ఎలాగో తెలుసా..?
Credit cards | దేశంలో క్రెడిట్ కార్డులు (Credit Cards) వినియోగించేవారి సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. అలాగని బ్యాంకులు ఎవ్వరికిపడితే వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి అంగీకరించవు. మీ సిబిల్ స్కోర్ (Cibil Score) సరిగ్గా ఉంటేనే కార్డులు జారీచేస్తాయి. ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ నగదు పరిమితితో, ఆదాయం తక్కువగా ఉంటే తక్కువ నగదు పరిమితితో క్రెడిట్ కార్డులు ఇస్తాయి. మరి సిబిల్ స్కోర్ సరిగా లేని వాళ్లు క్రెడిట్ కార్డులను పొందలేరా.. అంటే పొందవచ్చు.
Credit cards : దేశంలో క్రెడిట్ కార్డులు (Credit Cards) వినియోగించేవారి సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. అలాగని బ్యాంకులు ఎవ్వరికిపడితే వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి అంగీకరించవు. మీ సిబిల్ స్కోర్ (Cibil Score) సరిగ్గా ఉంటేనే కార్డులు జారీచేస్తాయి. ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ నగదు పరిమితితో, ఆదాయం తక్కువగా ఉంటే తక్కువ నగదు పరిమితితో క్రెడిట్ కార్డులు ఇస్తాయి. మరి సిబిల్ స్కోర్ సరిగా లేని వాళ్లు క్రెడిట్ కార్డులను పొందలేరా.. అంటే పొందవచ్చు. అందుకు క్రెడిట్ కార్డును పొందగోరే వ్యక్తి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయాల్సి ఉంటుంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తానికి సరిపడా బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తాయి. వీటినే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు (Secured Credit Cards) అంటారు. అయితే ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు ఎలా పని చేస్తాయి..? ప్రయోజనాలు ఏమిటి..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు
ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయంలో బ్యాంకులు.. క్రెడిట్ స్కోరు, ఆదాయ స్థాయి, ఉద్యోగ ప్రొఫైల్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవు. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ హామీగా ఉంటుంది. దీనివల్ల కార్డు జారీచేసిన బ్యాంకుకు రిస్క్ ఉండదు. కార్డు వినియోగదారుడు తమ బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమైతే కార్డును జారీచేసిన సంస్థ వాటిని వసూలు చేసేందుకు ఫిక్స్డ్ డిపాజిట్‌ను లిక్విడేట్ చేసే అవకాశం ఉంటుంది.
స్కోరు పెంచుకోవడానికి..
ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. మీకు అప్పటివరకు పేలవమైన లేదా తక్కువ క్రెడిట్ చరిత్ర ఉన్నట్లయితే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును పొందిన తర్వాత మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులతో జరిపిన లావాదేవీ వివరాలు కూడా క్రెడిట్ బ్యూరోలకు అందుతాయి. బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడానికి ఈ డేటాను ఉపయోగిస్తాయి. కాబట్టి ఇది మీ విశ్వసనీయతను పెంచడంలోనూ సహాయపడుతుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులతో క్రెడిట్ స్కోరు పెంచుకోవడంవల్ల భవిష్యత్తులో రుణాలు, ఇతర క్రెడిట్ ఎంపికలను పొందే అవకాశాలను పెంచుకోవచ్చు.
క్రెడిట్ పరిమితి
సాధారణంగా బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు పరిమితిని హామీగా లేదా సెక్యూరిటీగా ఉంచిన ఫిక్స్డ్ డిపాజిట్ విలువ ఆధారంగా నిర్ణయిస్తుంది. క్రెడిట్ కార్డు జారీచేసే సంస్థలు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తంపై 80-90 శాతం వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌పై మెచ్యూరిటీ వరకు వడ్డీ వస్తుంది. దీనివల్ల సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుదారులు స్థిరమైన రాబడిని అందుకుంటూనే, క్రెడిట్ సదుపాయాన్ని కూడా పొందుతారు.
ప్రయోజనాలు
ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే మీ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును స్వదేశీ విదేశీ కొనుగోళ్లు, చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మెరుగైన క్రెడిట్ హిస్టరీని పొందవచ్చు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగిస్తే కొంత కాలానికి అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుకు అప్‌గ్రేడ్ కావచ్చు. కొన్నిసార్లు అదనపు పూచీకత్తు (డిపాజిట్) అవసరం లేకుండా క్రెడిట్ పరిమితిని పెంచుతుంటారు. సెక్యూర్డ్ కార్డుదారుడు ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేయరు కాబట్టి ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

