హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ) : సమాజ నిర్మాతలు గురువులేనని, జాతి నిర్మాణంలో భాగస్వామ్యంకావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన వారిని ఘనంగా సన్మానించారు. వీరికి రూ. 10వేల చెక్కు, ప్రశంసాపత్రం, మోడల్స్‌ను అందజేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.