గోల్నాక : అంబర్పేటలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో జరిగిన వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఓ వెంకటేశ్ చౌధరి హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేసి దివంగత ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చౌధరి గుర్తుచేశారు. ఎన్టీఆర్కు జోహార్లు అంటూ నినదించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కే పరుశురాం, నర్సింహగౌడ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.