సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో ట్యాక్స్ చెల్లింపుదారులకు అధికారిక వెబ్సైట్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని రెవెన్యూ, ఐటీ అడిషనల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదలు చేశారు.
ఇంటి యజమాని పేరులో తప్పులను సరిచేసుకోవడం, డోర్ నంబర్‌ను సరిచేసుకోవడం, ఆస్తి పన్ను స్వీయ అంచనా, సాధారణ పన్నుల అంచనాను తెలుసుకునేందుకు వెబ్సైట్లో మరిన్ని ఆప్షన్లు చేర్చినట్లు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకుని పన్నుల చెల్లిపులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.