సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : కుషాయిగూడ ఈసీఐఎల్‌లోని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ డీలర్స్ వెంకటరమణ మోటార్స్ షోరూమ్‌లో శనివారం ట్విన్ సిలిండర్ పంచ్ ఐసీఎన్జీ కారును కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, టాటా మోటార్స్ రీజినల్ మేనేజర్ గోపి గోపు, వీవీసీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వీవీ రాజేంద్రప్రసాద్ మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ సరికొత్త టాటా పంచ్ ఐసీఎన్జీ కారును స్థానిక వెంకటరమణ మోటార్స్ షోరూమ్‌లో విడుదల చేయడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. వెంకటరమణ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీవీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..టాటా కార్ సేల్స్‌లో వెంకటరమణ మోటార్స్ మంచి సేల్స్‌తో దూసుకెళ్తుందని చెప్పారు. ఒక కేజీ సీఎన్జీతో 26 కిలోమీటర్ల మైలేజ్ దొరుకుతుందన్నారు. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7,09,900 ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ మోటార్స్ సీఈఓ మహేందర్, జనరల్ మేనేజర్ రవీందర్, షోరూమ్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.