Tata Power | హైదరాబాద్, జూలై 27: టాటా పవర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ట్రస్ట్ (TPCDT), అనుపమ్ ఖేర్ స్టూడియోస్ కలిసి ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏర్పాటు చేసింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, విస్తృత న్యూరోడైవర్సిటీ స్పెక్ట్రమ్‌పై అవగాహన పెంపొందించడానికి టాటా పవర్ చేపట్టిన ‘పే అటెన్షన్ ‘ కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
ఈ స్క్రీనింగ్‌కు టాటా పవర్ సీహెచ్ఆర్వో & చీఫ్ సస్టైనబిలిటీ & సీఎస్ఆర్ అధికారి హిమాల్ తివారి హాజరయ్యారు. న్యూరోడైవర్స్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, స్పెషలిస్టులు, పే అటెన్షన్ ఎన్జీవో భాగస్వాములు మరియు టాటా గ్రూప్ సంస్థల ప్రతినిధులు సహా మొత్తం 350 మందిపైగా ఈ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. ఈ ప్రదర్శనకు ‘పే అటెన్షన్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ జోన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జోన్‌ను సెన్సరీ ఆల్ అనే స్టార్టప్ సహకారంతో రూపొందించారు. ఇది సందర్శకులకు న్యూరోడైవర్స్ వ్యక్తుల దృక్కోణం నుంచి ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ప్రత్యేక అవకాశాన్ని అందించింది.
టాటా పవర్ అనుపమ్ ఖేర్ స్టూడియోలు కలిసి హైదరాబాద్‌తో పాటు కోల్‌కతాలోనూ తన్వి ది గ్రేట్ ప్రత్యేక స్క్రీనింగ్, సెన్సరీ జోన్లను ఏర్పాటుచేయనుంది. ఈ స్క్రీనింగ్‌లో నాడీ వైవిధ్యం, నాడీ సంబంధిత వ్యక్తులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, సంరక్షకులు, పాలసీదారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో NIEPID, సాధన, స్మైల్ ఫౌండేషన్, అనన్య చైల్డ్ డెవలప్మెంట్సెంటర్, టాటా ట్రస్ట్‌లు, ఇండియన్ హోటల్స్ కంపెనీ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా హిమాల్ తివారి మాట్లాడుతూ.. ఇంక్లూజన్ అంటే ఆటిజం ఉన్న వ్యక్తులను భిన్నంగా చూసుకోవడమే కాదు.. ప్రతి ఒక్కరిలోనూ విశిష్టతను సెలబ్రేట్ చేసుకోవడమని తెలిపారు. తన్వి ది గ్రేట్ చిత్రం ద్వారా సానుభూతిని పెంపొందించడం, వ్యత్యాసాలను స్వీకరించడంపై మాట్లాడుకునేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. టాటా పవర్ ద్వారా చేపట్టిన పే అటెన్షన్ కార్యక్రమం ద్వారా అంతరాలను తగ్గించేదిశగా పనిచేస్తున్నామని చెప్పారు. మన దేశంలోనే మొదటి ఫిజికల్, డిజిటల్ న్యూరో డైవర్సిటీ సపోర్ట్ నెట్వర్క్ అని అన్నారు.
నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘మనందరం కథలతోనే తయారయ్యాం. అవి మనల్ని రూపొందిస్తాయి.. ప్రేరేపిస్తాయి. కథకులకుగా మంచితనం, సమ్మిళితాన్ని ప్రచారం చేయడం మన కర్తవ్యం. తన్వి ది గ్రేట్ అనేది నా మేనకోడలు తన్వి ప్రేరణగా రూపొందింది. ఆమె కూడా చాలామంది న్యూరో డైవర్స్ వ్యక్తుల మాదిరిగానే ప్రతిభ, సామర్థ్యంతో ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను చేరినప్పుడే ఈ కథ నిజంగా విజయం సాధిస్తుంది. టాటా పవర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ట్రస్ట్తమ పే అటెన్షన్ చొరవతో ఈ కంపెనీ ఆటిజం, న్యూరోడైవర్సిటీతో బాధపడుతున్నవారికి మద్దతు, వారిపై అవగాహనను కల్పిస్తోంది. అలాంటి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు గర్వకారణం. ఆ కంపెనీతో కలిసి న్యూరోడైవర్స్ కమ్యూనిటీలకు శాశ్వత, అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించాలని అనుకుంటున్నాం’ అని తెలిపారు.