రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆఫీసులలో కూర్చొని వారికి తోచినట్లు డివిజన్లను ఏర్పాటు చేశారు. అంత హరిబరిగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసి 150 ఉన్న డివిజన్లను 300లకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది. డివిజన్ల సరిహద్దులలో కూడా పారదర్శకత లేదు. మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడతాం.
ఇప్పుడున్న 150 డివిజన్లకు సరైన అధికారులు, మ్యాన్‌పవర్ లేని పరిస్థితుల్లో నూతనంగా మరో 150 డివిజన్లను ఏ విధంగా పెంచారు. కార్పొరేటర్లకు గుడ్ న్యూస్ అని , డివిజన్‌కు రూ. రెండు కోట్ల చొప్పున నిధులు ఇస్తామని చెప్పి హడావుడి చేసి ఇన్చార్జి మంత్రులకు అప్పగించడం ఎంత వరకు సబబు. నగరంలోని వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలలో కూడా కేవలం తమ పార్టీకి చెందినవి మాత్రమే తొలగిస్తున్నారు. తొలిగిస్తే అన్ని ఫ్లెక్సీలను తొలగించాలి. కౌన్సిల్లో ఈ అంశంపై కూడా నిలదీస్తాం.