అమీర్పేట్ ఫిబ్రవరి 13 : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బాపునగర్ బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షులు హరి సింగ్ జాదవ్ తెలిపారు. ఈ మేరకు బాపునగర్ బస్తీలోని సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని వేడుకలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి భక్తులు సేవాలాల్ మహరాజ్ కి పూజలు నిర్వహిస్తారని, ఉదయం 9:21 గంటలకు మహా భోగ్ జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. వైభవంగా జరిగే ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ బస్తీకి చెందిన గోపీచంద్, రాజు, పవన్ తదితరులతో కలిసి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆహ్వాన పత్రిక అందించామని హరిసింగ్ జాదవ్ తెలిపారు.
Komatireddy Venkat Reddy | మిమ్మల్ని ఇక్కడికి ఎవడు రమ్మన్నడు.. రైతులపై మంత్రి కోమటిరెడ్డి జులుం!
BRS @ 25 Years | 25వ పడిలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్.. భారీ బహిరంగ సభ పెట్టేందుకు ప్లాన్!