జగద్గిరిగుట్ట, జనవరి 14 : సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూ ములు కబ్జా చేస్తున్నారు. జగద్గిరిగుట్ట కొండపైన గల రింగుబస్తీ, రాజీవ్‌గృహకల్ప సమీపంలో రాత్రికిరాత్రే కొంతమంది ప్రభుత్వస్థలం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. పరదాలు, తెరలు అడ్డుపెట్టి లోపల సామగ్రి నిల్వచేస్తున్నారు. అయితే రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల అండతోనే అక్రమార్కలు రెచ్చిపోతున్నారని స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.