మహేశ్వరం : ఉచిత శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మన్ కార్తీక్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ప్రేమ శ్రీ గార్డెన్స్‌లో స్వర్గీయ ఇంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్టు కోచింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు కోచింగ్ సెంటర్లకు వెళ్లి లక్షల రూపాయలను వృధా చేసుకోకుండా ఉచిత కోచింగ్ సెంటర్లను వినియోగించు కోవాలని ఆయన అన్నారు.
రెండు నెలల పాటు నిర్వహించె ఈ కోచింగ్ సెంటర్లలో మంచి నైపుణ్యత గల వారు ఉన్నారని ఆయన తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, బూడిద తేజస్విని శ్రీకాంత్‌గౌడ్, సప్పిడి లావణ్యరాజు, రెడ్డిగళ్ల సుమన్, తుక్కుగూడ మున్సిపాలిటీ పట్టణ అద్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, టీఆర్ఎస్ యూత్ అద్యక్షుడు సామ్యూల్ రాజు, నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.