బంజారాహిల్స్: రెండేళ్లుగా ఆస్తిపన్ను బకాయి చెల్లించకపోవడంతో పాటు బల్దియా నోటీసులకు స్పందించకపోవడంతో బంజారాహిల్స్ రోడ్ నం.1లోని తాజ్‌బంజారా హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. సుమారు రూ.1.40 కోట్ల మేర బకాయి ఉండటంతో అనేకసార్లు నోటీసులు జారీ చేశారు.
అయినా చెల్లించకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అయితే తమ హోటల్ మరమ్మతులు జరుగుతున్నందున బకాయి చెల్లింపు కోసం మరింత గడువు ఇవ్వాలని యాజమాన్యం కోరింది. ఇందుకు నిబంధనలు అంగీకరించవన్న సర్కిల్ 18 అధికారులు.. హోటల్‌ను సీజ్ చేశారు.